సూర్యాపేట జిల్లా:రేపు రిలీజ్ కానున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500/లు.అవును మీరు చదువుతున్నది నిజమే.ఇదేమిటని అడిగితే డిస్ట్రిబ్యూటర్ పెంచుకోమన్నాడని థియేటర్ల యాజమాన్యం నుండి వస్తున్న సమాధానం.దీనిపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని అభిమాన సంఘాల వారు కోరుతున్నారు.సినీ హీరోల అభిమానుల వీక్నెస్ పాయింట్ తో థియేటర్ల యాజమాన్యాలు,సినిమా డిస్ట్రిబ్యూటర్లు కలిసి అభిమానులు జేబులు గుల్ల చేసేందుకు రంగం సిద్ధమైంది.
వివరాల ప్రకారం అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అగ్రశ్రేణి కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే.అయితే అన్ని చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ ధరలు 400 శాతం అమాంతం పెంచేశారు.
గతంలో బెనిఫిట్ షో టికెట్ ధర,మామూలు షో టికెట్ ధర ఒకే రకంగా ఉండేది.కానీ,సినిమాకు ఉన్న క్రేజ్,అగ్ర కథానాయకులు నటిస్తుండడంతో దానిని క్యాష్ చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యాజమాన్యాలు అమాంతం బెనిఫిట్ షో టికెట్ ధర పెంచి అభిమానులను ఆగం పట్టిస్తున్నారు.
థీయేటర్ల యాజమాన్యాలకు రెండు వందల ముప్పై రూపాయలకు ఇస్తే థియేటర్ల యాజమాన్యాలు అభిమాన సంఘాల నాయకులకు 500 రూపాయల కు విక్రయిస్తున్నారని ఓ కథానాయకుడు అభిమాని వాపోయారు.టికెట్ ధరలు ప్రభుత్వం చెప్పిన విధంగా ఉండాలి కానీ,డిస్ట్రిబ్యూటర్లు చెబితే పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
బెనిఫిట్ షో టికెట్స్ ధరల పెరుగుదలపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.