హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ సిద్దార్థ్ తన టాలెంట్ తో వరస హిట్లు కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు.అతడి కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యిన నిఖిల్ ఒక్క సూపర్ హిట్ తో తన కెరీర్ ను కూడా గాడిలో పెట్టుకోవాలని చూస్తున్నాడు.
ప్రెసెంట్ నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో ‘18 పేజెస్‘ ఒకటి.
ఈ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమా కథను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రాయడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

సుకుమార్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన రాయడం వల్ల ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కు కూడా బాగా ఉపయోగ పడుతుంది.ఇక ఈ సినిమాలో నిఖిల్ కు జంటగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
టైటిల్ కూడా కొత్తగా ఉండడంతో అందరిని ఆకట్టుకుంది.

ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ కు మంచి స్పందన లభించింది.ఇక ఇటీవల వాయిదా పడ్డ ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.
ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారట.నిజానికి ఇదే రోజు మాస్ రాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో ఇప్పుడు నిఖిల్ రవితేజ కు పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.మరి ఆ సమయానికి నిఖిల్ వెనక్కి తగ్గుతాడో లేదంటే ఆ డేట్ కే రిలీజ్ చేయాలనీ మేకర్స్ పట్టుబడతారో చూడాలి.