సూర్యాపేట జిల్లా:జీవితాంతం కలిసి ఉండాలని కలలుకన్నారు.ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటవ్వాలని ఆశపడ్డారు.
కానీ,వారి ప్రేమకు,పెళ్లికి ఎవరు ఆటంకం కల్పించారో తెలియదు.ఏమైందో ఏమో కానీ,గత ఐదేళ్లుగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న ప్రేమజంట పురుగుల మందు తాగి విగత జీవులుగా మారిన విషాదఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)మండలం( Atmakur(S) ) తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే తుమ్మల పెన్ పహాడ్( Thummala Penphad ) గ్రామానికి చెందిన గుండగాని సంజయ్(25), తుమ్మల పెన్ పహాడ్ ఆవాస ప్రాంతం కృష్ణసముద్రం గ్రామానికి చెందిన సళ్లగుండ నాగజ్యోతి(24) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఇక తాము కలిసి బ్రతకలేమని మనస్తాపానికి గురై, క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
శనివారం రాత్రి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.దీనితో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.