తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులది కీలక పాత్ర:ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.అటువంటి జర్నలిస్టులకు 200 గజాల ఇంటి స్థలాలు కేటాయించాలని మంగళవారం హుజూర్ నగర్ ఆర్డిఓకి రాసిన లేఖ ద్వారా కోరారు.

 Journalists Play A Vital Role In The Telangana Movement: Uttam , Uttam Kumar Red-TeluguStop.com

తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో పాటు జర్నలిస్టులు కూడా నిరాహార దీక్షలు,ర్యాలీలు, ధర్నాలు చేశారని గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు సకలజనులను ముందుండి నడిపించారన్నారు.

ఎండనక వాననక నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు కరోనా సమయంలో ధైర్యంగా ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని, జర్నలిస్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హుజూర్ నగర్ పట్నంలోని ఫణిగిరి గుట్ట వద్ద ప్రభుత్వ భూమిని సేకరించామన్నారు.పట్టణ, మండల జర్నలిస్టులకు 200 గజాల ఇండ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube