కంబోడియా దేశంలో సైబర్ మోసాలు చెపిస్తున్న ముఠాను పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా: కంబోడియా దేశం( Cambodia )లో చైనీస్ సంబంధించిన కంపెనీలో సైబర్ మోసాలు చెపిస్తున్న ముఠాను పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయానికి నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల పట్టణం పెద్దూర్ గ్రామానికి చెందిన అతికం లక్ష్మీ అనే మహిళ వచ్చి నా కొడుకు అతికం శివ ప్రసాద్ జగిత్యాల జిల్లా కోడిమ్యాల గ్రామానికి చెందిన కంచర్ల సాయి ప్రసాద్ అనే ఏజెంట్ కి 1,40,000/- రూపాయలు ఇచ్చి కాంబోడియా దేశానికి వెళ్లడు అని చెప్పగా, శివ ప్రసాద్ మొబైల్ నెంబర్ తీసుకొని వాట్సప్ ద్వారా మాట్లాడగా.

ఇక్కడ చైనీస్ కి చెందిన కంపెనీలో శివ ప్రసాద్ పాస్ పోస్ట్ తీసుకొని సైబర్ నేరాలు చేపిస్తున్నరని నాలాగా ఇక్కడ భారతదేశం కి సంబంధించిన 500 నుంచి 600 మంది బాధితులు ఉన్నారని వీరందరి తో కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఇండియన్ ఫోన్ నంబర్స్ ఇచ్చి లాటరీ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, టాస్క్ లు ఇచ్చి ఈ టాస్క్ లు చేస్తే అధికమొత్తంలో డబ్బులు వస్తాయని సైబర్ మోసాలు చేయాయిస్తున్నారు అని తెలపడం జరిగిందన్నారు.వెంటనే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కంబోడియాలో ఉన్న ఇండియన్ ఏంబాసి అధికారులతో మాట్లాడి బాధితుని యెక్క డీటెయిల్స్ షేర్ చేయాగా అక్కడి లోకల్ పోలీస్ ల సహాయంతో రేస్కు చేసి శివ ప్రసాద్ కాపాడడం జరిగిందని, శివ ప్రసాద్ రెండు రోజుల లోపు ఇండియాకు చేరుకుంటారని,అదేవిధంగా అక్కడ ఉన్న బాధితులని కాపాడి ఇండియా కి పంపించడం జరుగుతుందని తెలిపారు.

జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారించగా 10,000 రూపాయలు కమిషన్ తీసుకొని లక్నో కి చెందిన సదాకత్ అనే వ్యక్తి కి పంపగా ప్రస్తుతం మాళ్దివీస్( Maldives ) లో ఉంటున్నడని, అతను 10,000 రూపాయల కమిషన్ తీసుకొని పూణే లో ఉన్న అబిద్ ఆన్సరీ కి పంపగా వీరి వెనుక ఉన్న బీహార్ రాష్టానికి చెందిన ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న షాదబ్ అనే వ్యక్తికి పంపగా షాదబ్ కంబోడియా దేశానికి పంపుతాడని వీరిలో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్ ని ,పూణే లో ఉన్న అబిద్ ఆన్సరీ ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మిగతా ఇద్దరిని త్వరలో పట్టుకోవడం జరుగుతున్నారు.సైబర్ సెక్యూరిటీ వారి సహాయంతో ఈ కేసును ఛేదించడం జరుగుతుందని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్యోగు, ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళు యువకులు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించాలని ఎస్పీ కోరారు.జిల్లాలో ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ నెంబర్ 8712656411 కి నేరుగా ఫోన్ కాల్ ద్వారా పిర్యాదు చేస్తే ఆ పిర్యాదు పై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

Advertisement

ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ రఘుపతి, టాస్క్ఫోర్స్ సి.ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి - జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి
Advertisement

Latest Rajanna Sircilla News