నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్ లు అమర్చితే చర్యలు తప్పవు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్,నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్ లు,అధిక శబ్దాలు వచ్చేలా వాహనాలకు సైలెన్సర్లు బిగించే వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.గత నెల రోజుల పరిధిలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగించిన 05 వాహనలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, త్రిబుల్ రైడింగ్ చేసే వారిపై 159 మందికి జరిమానా విధించి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

 Actions Will Be Taken If Sirens Are Fitted To Vehicles Against The Rules.-TeluguStop.com

మైనర్ డ్రైవింగ్ ( Minor driving )చేసే వారిపై 23 కేసులు నమోదు, వాహనాలకు డబుల్ సైలెన్సర్లు బిగించి శబ్ద కాలుశ్యానికి కారణం అవుతున్న 27 వాహనాలను సీజ్ చేసి జరిమాన విధించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ( SP Akhil Mahajan ) మాట్లాడుతూ.

ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించడం వల్ల వారు తెలిసి తెలియని డ్రైవింగ్ వల్ల ప్రమాధాలకి కారణం అవుతున్నారని ,దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి పట్టుబడిన వారి తల్లిదండ్రులు,వాహనాల యజమానుల పై కేసులు నమోదు చేయడం జరుగుతుదని హెచ్చరించారు.జిల్లాలో నిబంధనలు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,గడిచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్లు బిగించిన 05 వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు.

జిల్లాలో సైలెన్సర్ లను తీసివేసి శబ్ద కాలుష్యం చేసే వాహనాలపై ,అధిక వేగంతో త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటుగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube