సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :సి-విజిల్ యాప్( C-VIGIL app ) ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి( Anurag Jayanti ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఓటర్ లను మభ్య పెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, లైవ్ వీడియోలను సి – విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని తెలిపారు.

 Violations Of The Election Code Should Be Reported Through The C-vigil App,, C--TeluguStop.com

సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదుల పై వంద నిమిషాలలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, లైవ్ ఫోటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జి.పి.ఎస్.ఆన్ లో ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్( Geographic information ) ద్వారా లోకేషన్ నమోదు అవుతుందని, సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత కామెంట్స్ చేసిన, పార్టీ అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు లాంటి వివరాలను, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించిన, ఇతర ఎన్నికల ఉల్లంఘనల పై లైవ్ ఫోటోలు, వీడియోలు సి – విజిల్ యాప్ ద్వారా పంపాలని సూచించారు.ప్రజలు సి-విజిల్ యాప్ ను తమ ఫోన్ లలో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ను అప్లోడ్ చేసి తమ దృష్టికి తీసుకుని రావాలని, 24 గంటలు కలెక్టరేట్ కార్యాలయంలో సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నెంబర్ లను గోప్యంగా ఉంచనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఈ ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube