తలనొప్పి( headache ) అనేది మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది.తలనొప్పి వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది.
అలాగే ఏ పని మీద కూడా ఏకాగ్రత కనిపించదు.తలనొప్పి రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి.
ఆ కారణాల గురించి మనం ముందుగానే తెలుసుకుందాం.సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఫోన్ ను ఎక్కువగా వాడటం, కంప్యూటర్ నీ ఎక్కువగా చూడడం లాంటి కారణాల వలన తలనొప్పి తరచుగా వస్తూ ఉంటుంది.
ఒక్కోసారి సైనస్ కారణంగా కూడా తలనొప్పి వస్తుంది.మనలో చాలామంది తలనొప్పి రాగానే టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు.

అయితే అలా టాబ్లెట్లు వేసుకోకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.తక్కువగా ఉన్నప్పుడే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది.తలనొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం ట్యాబ్లెట్లను( tablets ) వేసుకోవాల్సిందే.అయితే ఈ రెమెడీ కోసం రెండు ఇంగ్రిడియంట్స్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.ఈ రెమిడి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.అయితే ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నాలుగు మిరియాలను( Peppers ) పొడిగా చేసి వేసుకోవాలి.ఆ తర్వాత అర చెక్క నిమ్మరసం( lemon juice ) పిండి బాగా కలిపి తాగాలి.

ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.తలనొప్పి వచ్చినప్పుడు ఈ డ్రింక్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.మిరియాల పొడి మార్కెట్లో కూడా లభిస్తుంది.కానీ ఇంటిలోనే మిరియాలను మిక్సీలో వేసి పొడి చేసుకుంటేనే మంచిది.మిరియాలు, నిమ్మకాయ తలనొప్పిని తగ్గించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి.కాబట్టి ఇంటి చిట్కాను ఫాలో అవ్వడం మంచిది.
సాధారణంగా మన ఇంటిలో మిరియాలు, నిమ్మకాయ చాలా సులభంగా లభ్యమవుతాయి.కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవ్వాలి.
అయితే తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు టాబ్లెట్లను ఉపయోగించడం మంచిది.