యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మూల మలుపు వద్ద సోమవారం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి.ఈ సంఘటనలో ఒక కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.
ఇందులో ఒక కారు హైదరాబాద్ కు, మరొకటి జనగామకు చెందినవిగా గుర్తించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది క్షతగాత్రులను భువనగిరి హాస్పిటల్ కి తరలించారు.అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న యాదగిరిగుట్ట పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.







