ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్.

ఉపాధి హామీ కూలీలతో కలిసి ఓట్లు అభ్యర్థించిన రాజేందర్ రావు చెల్లెలు.కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ.

 Congress Is Campaigning In Ellareddypet Mandal Centre , Ellareddypet, Congress,-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చెల్లెలు రోహిణి రాజేందర్ రావు కి మద్దతుగా ఎల్లారెడ్డిపేటలో ప్రచారం చేశారు.ఈ సందర్భంగా రోహిణి జాతీయ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 400 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగిందన్నారు.

అలాగే ఆగస్టు 15 వరకు రైతుల రుణాలన్నీ మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తా అని చెప్పి అప్పుల కుంపటిలో ముంచిన ఘనత కెసిఆర్ కు దక్కిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు.ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా కార్యదర్శి పందిరిల్ల లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఆకుల లత, ఎల్లారెడ్డిపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు బుర్కా జ్యోతి, గుండాడి రాంరెడ్డి,రఫిక్, శ్రీపాల్ రెడ్డి,సాయి రెడ్డి, రవీందర్ రెడ్డి, సంతోష్ గౌడ్, కార్తీక్, శ్రీనివాస్ యాదవ్, ఇలియాస్, కనకరాజు, గోపాల్, తిరుపతి గౌడ్.రామ్ చందర్, బిపేట రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube