ప్రస్తుతం ప్రపంచంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.గత కొన్ని వారాల నుండి ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటున్నాయి.
ఇరాన్.ఇజ్రాయెల్ (Iran ,Israel)మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచానికి దారితీసే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు.
ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరించడానికి అగ్రరాజ్యాలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి.గత ఏడాది అక్టోబర్ 7వ తారీఖు నుండి ఇజ్రాయెల్ వరుసగా యుద్ధాలు చేస్తూ ఉంది.
ఒకపక్క హమాస్ మిలిటెంట్ల (Hamas militants)దగ్గర బందీగా ఉన్న తమ పౌరులను విడిపించుకోవడానికి గాజాలో పోరాడుతుంది.ఇదే సమయంలో ఇరాన్ పై కూడా యుద్ధం చేస్తుంది.సరిగ్గా నెల రోజుల క్రితం ఇరాన్.ఇజ్రాయెల్ దేశాలు భారీ మిస్సైల్ రాకెట్లతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.కానీ అదృష్టవశాత్తు పెద్దగా ప్రాణ నష్టం వాటిల్ల లేదు.కానీ దాడుల విషయంలో ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గటం లేదు.
ఈ క్రమంలో ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Rais) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు బిగ్ బ్రేకింగ్ వైరల్ అవుతోంది.అజర్ బైజాన్(Azar Baijan) సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాకినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
వాతావరణ పరిస్థితులే ఈ ఘటనకు కారణమని తెలిపాయి.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.