రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈ రోజు 17వ బెటాలియన్ నందు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ ఉచిత శిక్షణ శిబిరంలో భాగంగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్ శాఖలో ఉపయోగించే ఆయుధాలు మొదలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ….
విద్యార్థులు, యువతను క్రీడల వైపు ప్రోత్సాహించేందుకు,చేడు మార్గాల వైపు దారిమల్లకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవతో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని,అందులో భాగంగా ఈ రోజు పట్టణ పరిధిలోని సార్థపూర్ నందు గల 17వ బెటాలియన్ నందు శిక్షణ శిబిరంలో ఉన్న విద్యార్థులకు పోలీస్ విధులు,పోలీసులు ఉపయోగిస్తున టెక్నాలజీ, ఆయుధలు,పోలీస్ సిబ్బంది తీసుకొనే శిక్షణ మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు.పోలీస్ వేసవి శిక్షణ లో భాగంగా పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలపై,ఆయుధాలపై అవగాహన కల్పించినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.