పగిలిన పైపు లైన్ సరిచేసిన పంపు ఆపరేటర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం రాత్రి అకస్మాత్తుగా పాత సప్తగిరి ఐరన్ స్టోర్ వద్ద మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ పగలగా ఆదివారం ఉదయం గాంధీ ఏరియా,ఎడ్ల అంగడి బజార్, కేసీఆర్ ఆత్మ గౌరవ సముదాయం కు వెళ్ళవలసిన పైపు లైన్ పాత సప్తగిరి ఐరన్ స్టోర్ వద్ద పగిలిపోగా ఆదివారం ఉదయం మిషన్ భగీరథ నీరు రావడం లేదని బస్ స్టాండ్ ప్రాంత మహిళలు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు పిర్యాదు చేయగా ఇట్టి విషయాన్ని మిషన్ భగీరథ ఏ ఈ వినయ్ దృష్టికి తీసుకు వెళ్లగా మిషన్ భగీరథ సిబ్బంది మరియు ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయతీ వాటర్ పంపు ఆపరేటర్ పిట్ల రాజు, రొడ్డ సతీశ్ లు కలిసి పగిలిన మిషన్ భగీరథ పైపు లైన్ రిపేర్ చేయడంతో నీటి సరఫరాకు నెలకొన్న అంతరాయం తొలగింది.భూమి పై నుండి పైపు లైన్ ఉండడం వల్ల తరచూ పైపు లైన్ పగిలిపోతుండగా దానిని భూమి పై నుండి కాకుండా భూమి లోపలి నుండి పైపు లైన్ వేస్తే తరచూ పైపు లైన్ పగిలి పోయె ప్రమాదం ఉండదని మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ మిషన్ భగీరథ ఏ ఈ వినయ్ కుమార్ దృష్టికి తీసుకు వెళ్ళారు.




Latest Rajanna Sircilla News