దేశ రక్షణ విధుల్లో పాలు పంచుకోవడంతో పాటు ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర సమయాల్లోనూ వేగంగా స్పందిస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది ఇండియర్ ఎయిర్‌ఫోర్స్( Indian Air Force ) .తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని దట్టమైన అడవుల్లో చిక్కుకుపోయిన ఇద్దరు ప్రవాస భారత మహిళలను భారత వాయుసేన రక్షించింది.శనివారం ఉదయం 6.30 గంటలకు సిర్మౌర్‌లోని చుర్దార్ ట్రాకింగ్ రూట్‌లోని తీస్రీ గ్రామంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది.
బాధిత మహిళలు శుక్రవారం ఈ ట్రాక్ పైకి వెళ్లగా.తీస్రీలో చిక్కుకున్నారు.వెన్నెముక గాయంతో బాధపడుతున్న వీరిలో ఒకరు కఠినమైన పరిస్ధితుల్లో అవరోహణ చేయలేకపోయారు.సాయంత్రం 4 గంటల సమయంలో వీరిద్దరి గురించి నోహ్రాధర్ పోలీసులకు సమాచారం అందడంతో వారు బాధితుల్ని రక్షించేందుకు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
వారి వెంట రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన బృందం కూడా వెళ్లింది.
తీస్రీ అడవుల్లో ఇద్దరు ఎన్ఆర్ఐ మహిళలు( NRI women ) చిక్కుకుపోయారనే నివేదికలు జిల్లా అధికార యంత్రాంగానికి శుక్రవారం సాయంత్రం అందాయని డిప్యూటీ కమీషనర్ సుమిత్ ఖిమ్తా తెలిపారు.ఎన్ఆర్ఐ మహిళలను సురక్షితంగా రక్షించడం కోసం హోంమంత్రిత్వ శాఖ, వైమానిక దళం, విదేశీ వ్యవహారాల శాఖ, స్థానిక అధికారులు సమన్వయంతో వ్యవహరించారు.శనివారం ఉదయం 11 గంటలకు వారిని విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీసీ తెలిపారు.
గత రాత్రి జిల్లా యంత్రాంగం బేస్ క్యాంప్‌కు 10 కిలోమీటర్ల దూరంలో వున్న మహిళల జాడను గుర్తించింది.
వారిని రిచా అభయ్ సోనావానే, సోనియా రత్తన్‌గా( Richa Abhay Sonavane, Sonia Rattan ) గుర్తించారు.రిచా 1980లో డార్జిలింగ్‌లో జన్మించిన బెంగాల్‌కు చెందినవారు, సోనియా 1978లో భారతదేశంలో జన్మించారు.వెన్నెముక గాయం కారణంగా ఆమెకు శస్త్రచికిత్స జరిగింది.
వీరిద్దరూ అమెరికా పౌరులు.వారిని రక్షించిన అనంతరం చికిత్స నిమిత్తం చండీగఢ్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో తమకు సమాచారం ఇవ్వకుండా ట్రాక్‌పైకి వెళ్లొద్దని పర్యాటకులను అధికారులు హెచ్చరించారు.