రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులో గల ఉన్న శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర శివ విగ్రహ పున ప్రతిష్టాపన కార్యక్రమం గురువారం నుండి మూడు రోజులపాటు జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు,భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
మూడవ రోజు అనగా శుక్రవారం రోజున శివ విగ్రహ ప్రతిష్టాపన,
మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు,భక్తులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.