రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ( Vemulawada Sri Raja Rajeswara Swamy Temple ) గోశాలకు 1000 కిలోల పశుగ్రాసం శుక్రవారం వితరణ చేశారు.
చొప్పదండి మండలం కాట్నాపల్లి గ్రామానికి చెందిన రాజరాజేశ్వర స్వామి భక్తులు గన్ను లంగారెడ్డి అనే వ్యక్తి వేములవాడ గోశాలకు ట్రాక్టర్లో తీసుకువచ్చి పశుగ్రాసం అందజేశారు.
వేసవికాలం వరి కోతల అనంతరం పంట పొలాల్లోనే పశుగ్రాసాన్ని సేకరించి గడ్డి కట్టలు చేసి ట్రాక్టర్ల ద్వారా పశుగ్రాసం తీసుకువచ్చారు