భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.భూ సేకరణ పనులు, ఇతర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

 Land Acquisition Works Should Be Completed Quickly Collector Anurag Jayanti, Lan-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడారు.కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం పరిధిలోని

వేములవాడ, అనుపురం, కొడుముంజ, నాంపల్లిలో ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉందని వివరించారు.

ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఎఫ్ఓ బాలామణి, రైల్వే శాఖ సీఈ, సిరిసిల్ల ఆర్డీవో రమేష్, ఏడీ సర్వే శ్రీనివాస్, ఆర్ అండ్ బీ, ఉద్యానవన ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube