సన్న వడ్లకు గాని దొడ్డు వడ్లకు గాని 500 రూపాయలు బోనస్ ఇచ్చుడే

రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ పార్టీ నాయకులకు పనిలేదని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే సన్న వడ్లకు గాని, దొడ్ల వడ్లకు గాని 500 రూపాయల బోనస్ ఇచ్చుడేనని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు అన్నారు.ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలందరికీ సన్న బియ్యం తినిపించాలనే ఆలోచనలతోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న,దొడ్డు వడ్లకు బోనస్ ప్రకటించడం జరిగిందని వారు గుర్తు చేశారు.

 A Bonus Of 500 Rupees Will Be Given For Thin Rice, 500 Rupees Bonus, Thin Rice-TeluguStop.com

బిఆర్ఎస్ పార్టీ వాళ్లు ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఏ ప్రచారం చేసిన బిఆర్ ఎస్ పార్టీ చెప్పే మాటలను ప్రజలు నమ్మరని మాటిమాటికీ కాంగ్రెస్ పార్టీ ని గద్దె దింపుతామని బిఆర్ ఎస్ పార్టీ వారు అంటున్నారని పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజలు ఎవరిని గద్దె దింపుతారనేది తెలుస్తది వారు అన్నారు.

బిఆర్ఎస్ పార్టీ నీ ప్రజలు గద్దె దింపడంతో వారు మృతి భ్రమించి మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

రైతుల మీద గత పది ఏండ్ల నుంచి లేని ప్రేమ బిఆర్ ఎస్ పార్టీ కి ఇప్పుడు ఎట్లా గుర్తు కు వచ్చిందని వారు ప్రశ్నించారు.రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదని అనే విషయాన్ని వారు గుర్తు చేశారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు.బిఆర్ఎస్ వారు గురువారం చేసిన దర్నాలను చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారనీ రైతులు సన్న వడ్లు పండిస్తే నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యము ఇయ్యవచ్చుననే సదుద్దేశంతో రేవంత్ రెడ్డి మాట్లాడితే దాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్సుకోలేక పైగా విమర్శలు చేస్తున్నారని ప్రజలు గమనించాలని వారు కోరారు.

బిఆర్ఎస్ పార్టీ కి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదని వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావుకు డిపాజిట్ కూడా రాదని జెడ్పిటిసి లక్ష్మణరావు మాట్లాడిన మాట తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.వారు మాట్లాడే ముందు వీటిని ప్రజలు వార్తాపత్రికలలో, ప్రసార సాధనాల్లో చూస్తారనే ఆలోచన ఉండాలన్నారు.

ఈ రోజు లోపల బిఆర్ఎస్ పార్టీ ఓక్క సీటు వచ్చే పరిస్థితి లో గానీ పోటీ పడిన పరిస్థితి లో ఉందా అని వారు ప్రశ్నించారు.మీ బావ నే పార్లమెంటు ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఓట్ల కోసం వచ్చిన దిక్కులేనిన్నీ డబ్బులు పంచినారు కౌంటింగ్ రోజున చూడండి ఎన్ని ఓట్లు వస్తాయో చూసుకొండని వారు హెద్దేవా చేశారు.

ఆ విషయాన్ని మరిచి పోయి కాంగ్రెస్ పార్టీ కే డిపాజిట్ రాదుఅని ఆనడం బాగా లేదని దానిని వారు తీవ్రంగా ఖండించారు.రైతుల పైన మీరు మొసలి కన్నీరు కార్చడం మానుకోండి అన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం గురించి చూసుకుంటారని వారు గుర్తు చేశారు.

కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రైతుల గురించి పట్టించుకోని బిఆర్ ఎస్ పార్టీ వాళ్లు రైతుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మొసలి కన్నీరు కార్చడం అవసరం లేదు ధర్నాలు రస్సోరోకోలు చేసే అర్హత లేదని ఆయన అన్నారు.రైతు సంక్షేమం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని , ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు నెలలో చేస్తారని గుర్తు చేశారు.

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి,వంగ గిరిధర్ రెడ్డి, పందిర్ల లింగం గౌడ్,పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుండాడి రాం రెడ్డి,మైనార్టీ సెల్ మండల నాయకులు రఫీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, ఎడ్ల రాజ్ కుమార్, గంట కార్తిక్ గౌడ్ , పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, సిరిపురం మహేందర్, బురుక ధర్మేందర్,పందిర్ల సుధాకర్ గౌడ్,గుర్రం రాములు, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, మెగి దేవయ్య ,అంతేర్పుల గోపాల్, గుంటుక రవి , గంట వెంకటేష్ గౌడ్, గంట ఆంజనేయులు గౌడ్, రాంచందూర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ నాయక్, భూక్యా చంధర్,ఎండి ఏలియాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube