ఎన్నికల ప్రచారం చేపట్టిన బిఆర్ఎస్ నాయకులు

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గ్రామ ఉపాధి హామీ కూలీల వద్ద బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.

 Brs Leaders Who Took Up The Election Campaign , Brs Leaders, Election Campaign,-TeluguStop.com

కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు మే 13న జరిగే ఎన్నికలలో కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది .తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ గొంతుక కొరకు గెలిపించాలన్నారు.ఇట్టి కార్యక్రమంలో మండల వైస్ చైర్మన్ మందాల అబ్రహం, గ్రామ శాఖ అధ్యక్షుడు మాదాడి కరుణాకర్ రావు, ఉపాధ్యక్షుడు మూడపల్లి శ్రీనివాస్,యువజన విభాగం అధ్యక్షుడు ఈర్లపెళ్లి రాజు, బిఆర్ఎస్ నాయకులు పడిగెల శ్రీనివాస్ , కల్లెడ శంకర్, కొట్టే రాములు, ఊరడి రవి , మోత్కుపల్లి గణేష్, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube