జపనీస్ వ్యాయామ( Japanese exercises ) విధానాలలో మొత్తం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే వ్యాయామాలు ఉంటాయి.అయితే అందులో ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ ఉండే కొవ్వును తగ్గించేందుకు ఉన్న వ్యాయామాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే సమతుల్య ఆహారం, వ్యాయామం కలిపి ఉండాలి.ఆపైన చేసే వ్యాయామాలు శరీరానికి శక్తిని, ఫిట్ నెస్ ని అందిస్తాయి.
అయితే ఆ వ్యాయామాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.జపాన్ వారి టబాటా( Tabata Workout ) అని పిలిచే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ టెక్నిక్ నీ చేయడం వలన కొవ్వు తగ్గించడంలో ప్రోత్సహిస్తుంది.
అలాగే ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వును కరిగించెందుకు ఈ టెక్నిక్ పనిచేస్తుంది.ఇక జపనీస్ మార్షల్ ఆర్ట్స్ లో కిండో, జూడో, కరాటే ఉన్నాయి.

ఇవి శారీరక దృఢత్వాన్ని మెరుగుపరచడంతో పాటు, మొత్తం శరీర బలాన్ని పెంచడంలో, అలాగే కొవ్వు తగ్గించడంలో సహాయపడతాయి.రేడియో టైపో కూడా జపాన్ లో ఒక సాధారణ వ్యాయామం.రేడియో టైపో కాలిస్టెనిక్స్ ఇందులో మొత్తం శరీర రిథమిక్ కదికలు ఉంటాయి.ఇక ఇవి కోర్ కండరాలకు పనిచేస్తుంది.దీంతో కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది హులా హుప్ వ్యాయామం పిల్లల కోసం ఒక ఆహ్లాదకరమైన ఆట లాంటిది.ఇది బరువు తగ్గేందుకు, పొత్తికడుపు కండరాలు కదిలేందుకు కూడా ఉపయోగపడుతుంది.

అలాగే క్యాలరీలను బర్న్ చేయడంలో, పొత్తికడుపును టోన్ తేయడంలో ఇది సహాయపడుతుంది.ప్లాంక్స్, స్టాటిక్ లెగ్ లిఫ్ట్‌లు( Planks, ) జపనీస్ ఫిట్‌నెస్ నియమావళిలో కనిపించే రెండు సాధారణమైన వ్యాయామాలు పొట్ట కండరాలను సాగదీసి, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో ఇవి సహకరిస్తాయి.అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది పొట్ట చుట్టూ బరువు ఉండటం వలన ఎన్నో వ్యాయామాలు చేసి బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే ఒక్కసారి ఈ జపనీస్ వ్యాయామాలు ప్రయత్నించి చూస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి.