సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలని జిల్లా ఎస్పీ సుచించారు.

 Beware Of Scams By Cyber Criminals Sp Akhil Mahajan, Beware Of Scams ,cyber Crim-TeluguStop.com

వారం రోజుల వ్యవదిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు.

సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టైలరింగ్ చేస్తూ ఉన్న ఒక బాధితునికి ఆర్మీ నుంచి ఆఫీసర్స్ మాట్లాడుతున్నామని చెప్పి ఫ్రాడ్ కాల్ చేసి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయాలి మాకు ఆర్మీ డ్రెస్సెస్ అని చెప్పగా బాధితులు నమ్మారు తర్వాత అమౌంట్ సెండ్ చేస్తాము అని చెప్పి గూగుల్ పే ఫోన్ పే ద్వారా వాళ్లు అమౌంట్ పంపుతున్నట్టుగా నమ్మించి పిన్ని ఎంటర్ చేస్తే మీకు అమౌంట్ వస్తాయని చెప్పగా బాధితుడు పిన్ ఎంటర్ చేయగా 25,000/- రూపాయలు నష్టపోయారు.

వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్విక్ యాప్ అని లోన్ యాప్ ద్వారా 3000 రూపాయలు లోన్ తీసుకోని దానిని చెల్లించిన కూడా ఇంకా ఇంకా డబ్బులు పంపించవలసిందిగా లేకపోతే తన మార్ఫుడ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో వాళ్ళ కాంటాక్ట్స్ కి పంపిస్తామని బెదిరింపులకు పాల్పడగా బాధితులు 15,000/- రూపాయలను పంపించడం జరిగింది ఇంకా అమౌంట్ పంపించమని అడగగా సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ జరిగింది.

● గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి తెలియకుండా ఏదో ఒక ఫ్రాడ్ లింక్ క్లిక్ చేయడం వలన అతని ఫోన్లో ఒక ఏపీకే ఇన్స్టాల్ కావడం జరిగింది తర్వాత తన ఫోన్ హ్యాక్ అయి తనకు తెలియకుండానే 50,000/- రూపాయలను నష్టపోయారు.

సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

1.లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
2.కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు.ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
3.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
4.లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
5.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు.వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
6.OLX, 99acres, Magicbricks లాంటా యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.
7.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
8.పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
9.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి.

లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube