మానసిక స్థితి బాగలేని కూతురు హత్యకు సంబంధించిన తల్లితండ్రులు అరెస్ట్, రిమాండ్ కి తరలింపు..

మానసిక స్థితి బాగలేని కూతురు హత్యకు సంబంధించిన తల్లితండ్రులు అరెస్ట్ ,రిమాండ్ కి తరలింపు.రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో మహిళ హత్యకు సబంధిచి నిందుతుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ.

 Parents Arrested For Murder Of Mentally Unstable Daughter Remanded, Parents Arre-TeluguStop.com

నిందుతుల విరారాలు: చెప్యాల.నర్సయ్య త/o ఎల్లయ్య, 49 సం.లు గ్రామం.నేరేళ్ళ.

చెప్యాల.ఎల్లవ్వ భ/o నర్సయ్య 43 సం.లు .

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్యాల యెల్లవ్వ , నరసయ్య ల కుమార్తె ప్రియాంక ఈ నెల 14 వ తేదీన మరణించగా , అట్టి మరణంపై గ్రామస్తులకు అనుమానాలు రాగా అట్టి సమాచారాన్ని తీసుకున్న నేరెళ్ల గ్రామపంచాయతీ సెక్రటరీ రాజు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా, తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా మృతురాలు ప్రియాంక మరణించిన నేరెళ్ళ గ్రామం, దర్గాపల్లి గ్రామాన్ని సందర్శించిన పోలీస్ అధికారులు గ్రామస్తులను విచారణ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు అయిన ఎల్లవ్వ ,నర్సయ్య లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని ఒప్పుకుంటూ వారి పెద్ద కుమార్తె ప్రియాంక గత ఏడు సంవత్సరాల నుండి మానసిక వ్యాధితో బాధపడుతుండగా తల్లిదండ్రులు ప్రియాంకను ఆసుపత్రుల చుట్టూ, దేవాలయాల వద్దకు తిప్పి చాలా డబ్బులను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.

కొంతవరకు వ్యాధి నయం కావడంతో 2020 సంవత్సరంలో తన కుమార్తె ప్రియాంకను, నంగునూరు మండలంలోని దర్గపల్లి చెందిన పృద్వి అనే వ్యక్తితో వివాహం జరిపించారు.కాగా బతుకు తెరువు కోసం వారు కరీంనగర్ లోని సప్తగిరి కాలోని లో ఉంటున్నారు, వారికి 13 నెలల కుమారుడు ఉండగా గత నెల రోజులుగా ప్రియాంక మునుపటిలాగే మానసిక వ్యాధితో అందరిని ఇబ్బంది పెట్టడం, చుట్టుపక్కల వారిని దూషించటం, గొడవ పెట్టుకోవడం జరుగుతూ ఉండడం, మానసిక రోగంతో చుట్టుపక్కల వారిని, భర్తని కుటుంబ సభ్యులను, 13 నెలల బాలుడిని కూడా కొట్టడం కింద పారేయడం చేయడంతో ఇట్టి విషయాన్ని ప్రియాంక భర్త వారి తల్లిదండ్రులైన నరసయ్య,ఎల్లవ్వ లకు తెలపగా వారిద్దరు కరీంనగర్ లోని తమరు కుమార్తె ఇంటి నుంచి ఆమెను తీసుకొని మళ్లీ మానసిక వ్యాధి సోకిందని ఆసుపత్రుల్లో చూపిస్తామని ఆమెను బుగ్గ రాజేశ్వర స్వామి టెంపుల్ వద్దకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజులు ఉంచిన తర్వాత ఎంతకీ నయం కాకపోవడంతో

అమ్మాయి మరింత విపరీతంగా వ్యవహరించడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు తమ కుమార్తె ప్రియాంకను తీసుకొని నేరెళ్లలోని సొంత ఇంటికి వచ్చి , మంగళవారం రోజున గ్రామంలోని కొంతమంది, బంధువులు వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి చూసి వెళ్ళినారు.

కుమార్తె ఆరోగ్యం బాగుపడకపోవడం, ఆమెని చూపించడం కొరకు వివిధ ప్రాంతాల్లో కొంతమంది దగ్గర తల్లిదండ్రులు అప్పులు చేయడంతో అప్పుల భారం మరియు తమ కుమార్తె యొక్క వ్యవహారము తల్లిదండ్రులకు అవమానంగా, భారంగా మారడంతో మానసిక స్థితి బాగా లేని కుమార్తె యొక్క పీడ వదిలించుకోవాలని తల్లిదండ్రులు మంగళవారం రోజు రాత్రి అందాజ ఒంటిగంటకు తమ కుమార్తె నిద్రిస్తుండగా వారి ఇంటిలో ఉన్న నూలు దారంతో పేనిన త్రాడు తీసుకొని దానితో ఉరివేసి చంపినారని విచారణలో తేలింది.అనంతరం నిందుతులు ప్రియాంక ని చంపుటకు ఉపయోగించిన త్రాడును స్వాదీన పరుచుకొని నిందులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.

ప్రజలు మూఢనమ్మకాలు పేరుతో బాబాల ను,మంత్రగాళ్లను సంప్రదించకుండా, వైద్యులను మాత్రమే సంప్రదించలన్నారు.అవగాహన రహిత్యంతో దొంగ బాబాలని సంప్రదించి మోసపోవద్దని, ఈ అవగాహన లేకపోవడం వల్లనే పై సంఘటన జరిగిందని తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మహిళ హత్య కేసుని స్థానికుల సమాచారం మేరకు ఛేదించడం జరిగిందని, గ్రామాల్లో ,పట్టణాల్లో అనుమానస్పదంగా ఏవరైనా కనిపించిన,అనుమానస్పదంగా ఏదైనా సంఘటనలు జరిగినా వెంటనే డయల్100 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.ఈ మీడియా సమావేశంలో సిరిసిల్ల రూరల్ ఇంచార్జ్ సి.ఐ ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ సుధాకర్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube