డబ్బులు పంచా- మద్యం పంచా అంటివి కెటిఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచా,,,, మద్యం పంచా,,,, మాంసం పంచా,,,, అని చెప్పి కెటిఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గంలో విచ్చలవిడిగా పంచినావు నీ నైతీక విలువలు ఏమయ్యాయి ప్రజలకు జవాబు చెప్పాలని ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారం కోసం శాసనసభ ఎన్నికల్లో కూడా కేటీఆర్ డబ్బులు,మద్యం,మాంసం పంచి గెలుపొందినాడని ఆయన ఆరోపించారు.

 Money Liquor Distribution Says Ktr, Money Liquor Distribution ,ktr, Rajanna Sirc-TeluguStop.com

బిఆర్ఎస్ పార్టీ వాళ్ళవి చెప్పేటివి శ్రీ రంగ నీతులు చేసేటీవి తప్పులన్నారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలుస్తలేము అనే ఉద్దేశంతో డబ్బులు పంపిణీ చేశారని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ని ఓడ గొట్టాలని బిఆర్ఎస్,బిజెపి పార్టీలు గల్లీలో లొల్లి పెట్టుకుంటున్నాయి, ఢిల్లీలో దోస్తీ గడుతున్నాయని అన్నారు.

బిజెపితో కుమ్ముకై మిలాకత్ అయ్యి కొన్నిచోట్ల బిజెపికి ఓట్లు వేయించారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం కనిపిస్తలేదన్నారు.

కెటిఆర్ సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం లో ఓటు శాతం పడిపోతే కెటిఆర్ గ్రాఫ్ పడిపోవద్దనే విచ్చలవిడిగా మద్యం,డబ్బులు, మాంసం పంపిణి చేశారని ఆయన విమర్శించారు.బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులందరూ మూడో స్థానంలో ఉంటారని ఆయన అన్నారు.

బిజెపికి- కాంగ్రెస్ పార్టీకి మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉన్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఎన్నికల సందర్భంగా ఉద్యోగుల జీతభత్యాలు అదేవిధంగా సంక్షేమ పథకాలు నిల్చిపోయిన మాట వాస్తవం.

ఎన్నికల కోడు అనంతరం సంక్షేమ పథకాలపై దృష్టి సారించడం జరుగుతుందని జీత భత్యాలను కూడా యధావిధిగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, పందిర్ల లింగం గౌడ్, కొమ్మిరి శెట్టి తిరుపతి, వంగ గిరిధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు నంది కిషన్, బండారి బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube