అధిక వడ్డీలతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన వ్యక్తికి రెండు లక్షల రూపాయల జరిమానా:సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామానికి చెందిన మొల్లంకుల బాలయ్య అనే వ్యక్తి అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజల ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్నడన్నా సంచారం మేరకు ఏప్రిల్ నెలలో తనిఖీలు నిర్వహించగా మొల్లంకుల బాలయ్య వద్ద ప్రామిసరీ నోట్స్,చెక్స్, డాకుమెంట్స్ లభించిగా మొల్లంకుల బాలయ్య పై కేసు నమోదు చేసి కేసు విచారాణ అనంతరం ఈ రోజు జిల్లా కలెక్టర్ మొల్లంకుల బాలయ్య కి 2,00,000/- రూపాయల జరిమాన విధించినట్లు తెలిపారు.

 Two Lakh Rupees Fine For The Person Who Caused Trouble To People With High Inter-TeluguStop.com

ఈ సందర్భంగా సి.

ఐ మాట్లాడుతూ.ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేస్తూ, అట్టి అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, చట్ట విరుద్ధంగా,అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజలు ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చు అని, అలాగే స్థానిక పోలీసు వారికి ,డయల్100 కు పిర్యాదు చేయాలని ఎస్పీ కోరినారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube