విద్యార్థులకు కావాల్సిన వసతులు అన్ని కల్పించాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లలో విద్యార్థులకు కావాల్సిన వసతులు అన్ని కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లాలోని వసతి గృహ భవనాల యజమానులు, విద్యాలయాల ప్రిన్సిపాళ్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

 All Necessary Facilities Should Be Provided To The Students Collector Sandeep Ku-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయా వసతి గృహాల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు? ఎన్ని గదులు ఉన్నాయి? టాయిలెట్స్, కిచెన్ ఇతర సదుపాయాలపై సంబంధిత విద్యాలయాల ప్రిన్సిపాళ్లను ను ఆరా తీశారు.శానిటేషన్, మెనూ పై వివరాలు తెలుసుకున్నారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి, వసతి గదులు, టాయిలెట్స్, మెస్ హాల్ ఉండాలని, ఈ మేరకు పక్కా ప్రణాళికతో భవనాల యజమానులు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వసతి గదుల కిటికీలు, డోర్లకు దోమతెరలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు సమకూర్చాలని ఆదేశించారు.

జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో పంచాయతీ రాజ్, రోడ్స్ అండ్ బిల్డింగ్ అధికారులతో సర్వే నిర్వహించాలని, ఏ ఏ వసతులు కావాలో నివేదిక ఇవ్వాలని సూచించారు.విద్యార్థులకు స్వచ్చత, పరిశుభ్రత తప్పకుండా అవగాహన కల్పించాలని వివరించారు.

ప్రతి 15 రోజులకు ఒకసారి విద్యాలయంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించేలా చూసుకోవాలని, ఐరన్ లోపం ఉన్న పిల్లలకు మందులు, పండ్లు ఇవ్వాలని ఆదేశించారు.ఆహార పదార్థాలు తయారు చేసే సిబ్బందికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించాలని, నిలువ ఉన్న ఆహారం ఇవ్వకూడదని ప్రిన్సిపాళ్లకు కలెక్టర్ సూచించారు.

ఇక్కడ డీఈఓ రమేష్ కుమార్, జోనల్ ఆఫీసర్ ప్రత్యూష, సాంఘిక సంక్షేమ గురుకులాల కో ఆర్డినేటర్ థెరిసా, ఆయా విద్యా సంస్థల ప్రిన్సిపాళ్ళు, భవనాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube