అధిక లాభాలు చూపిస్తూ గొలుసు కట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు.

న్యూట్రీషన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి అమ్మితే అధిక లాభాలు వస్తాయంటు 9,00,000/- రూపాయలు చీటింగ్ చేసిన ఇద్దరు వ్యక్తులపై ,ఏజెంట్ల పైకేసు నమోదు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan)

 If People Are Cheated By Chain Businesses By Showing High Profits, Strict Action-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేద్రంలో న్యూట్రీషన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి అమ్మితే లాభాలు వస్తాయంటు ముగ్గురు వ్యక్తుల వద్ద 9,00,000/- రూపాయలు వసూలు చేసి చీటింగ్ చేసిన ఇద్దరు వ్యక్తుల పై మరియు ఏజెంట్ల పై కేసు నమోదు చేయడం జరిగిందని ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
తంగళ్ళపల్లి (Tangallapalli)మండలం బద్దనపల్లి గ్రామానికి(Baddnapalli village) చెందిన బొజ్జ లక్ష్మణ్, లాస్య(Bojja Laxman, Lasya) ఆను వారు ఇల్లంతకుంట గ్రామంలో ప్రిన్స్ న్యూట్రిషన్ సెంటర్ షాపును నడుపుతూ ఉండగా ఇల్లంతకుంట మండలం ముస్కాన్ పేట గ్రామానికి చెందిన సావనపల్లి శైలజ w/o బాబు వీరి ద్వారా అదే గ్రామానికి చెందిన జెట్టి విజయలక్ష్మి w/o బాబు వీరి ద్వారా అంతగిరి గ్రామానికి చెందిన వల్లంపట్ల సుమలత w/o తిరుపతి అను వారు ప్రతి రోజు ప్రిన్స్ న్యూట్రిషన్ సెంటర్ కి వెళ్లి న్యూట్రీషన్ షేక్ తగుతుండగా ఈ క్రమంలో బొజ్జ లక్ష్మణ్, లాస్య లు వారితో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి వాటిని అమ్మి సేల్స్ పెంచినట్లు అయితే ప్రతి నెల 50 వేల రూపాయల ఆదాయం వస్తుందని ఒకవేళ ఒక సంవత్సరం వరకు ఇట్టి ప్రొడక్ట్స్ అమ్ముడు పోకపోతే తిరిగి మీ డబ్బులు మీకు వస్తాయని లక్ష్మణ్, లాస్య లు నమ్మించగా ఒక్కక్కరు 3,00,000/- రూపాయల విలువగల న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయగా, వీరి దగ్గర దాదాపు 8 నెలలలు గడిచిన ఇట్టి ప్రొడక్ట్స్ ఎవరు కొనక పోయేసరికి రిటర్న్ పెట్టి డబ్బులు ఇప్పించగలరని వెళ్లి లాస్య,లక్ష్మణ్ లను అడగక లాస్య,లక్ష్మణ్ లు ఇంకా సంవత్సరం కాలేదు టైం ఉంది అని నమ్మబలకాగా కొన్ని రోజుల తరువాత మళ్ళీ వెళ్లగా సంవత్సరం దాటింది వీటిని రిటర్న్ తీసుకోవడం జరగదని పై ముగ్గురిని లాస్య, లక్ష్మణ్ లు మోసం చేయగా సావనపల్లి శైలజ పిర్యాదు మేరకు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో లాస్య, లక్ష్మణ్ లతో పాటుగా ఏజెంట్ల పైకేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో గొలుసు కట్టు స్కీమ్స్ పేరుతో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి అమ్మితే అధిక లాభాలు వస్తాయంటూ మోసాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని గొలుసు కట్టు స్కీమ్స్ ల పేరుతో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని వారిపై చట్టాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube