బతుకమ్మ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి నగదు, చీరలు వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా గ్రామపంచాయితీ సిబ్బందికి ఈ రోజు తలా ఒక్కరికి 1,000/-రూ!! చొప్పన 8,000/-రూ!! అలాగే మహిళా సిబ్బందికి మూడు చీరలు స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏట గ్రామపంచాయితి సిబ్బందికి నాస్వంత ఖర్చులతో ఇవ్వడం జరుగుతుందని అందులో బాగంగనే ఈ రోజు కూడా వారికి పండుగ సంధర్భంగా కొంత నగదు చీరెలు అందజేయడం జరిగిందని,

 Distribution Of Cash And Sarees To Gram Panchayat Staff On The Occasion Of Bathu-TeluguStop.com

అను నిత్యం గ్రామంలో పరిశుభ్రత కొరకు పాటుపడుతున్నారని పండుగ సందర్భంగా వారు కూడా కొత్త బట్టలు వేసుకొని బతుకమ్మ దసరా ఉత్సవాలలో పాల్గొనాలి అని ఉద్దేశంతో వారికి అందజేయడం జరిగిందని అన్నారు.

పండుగ సంధర్భంగా కానుకలు అందించినందకు గ్రామపంచాయితీ సిబ్బంది సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమార్, గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube