బతుకమ్మ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి నగదు, చీరలు వితరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా గ్రామపంచాయితీ సిబ్బందికి ఈ రోజు తలా ఒక్కరికి 1,000/-రూ!! చొప్పన 8,000/-రూ!! అలాగే మహిళా సిబ్బందికి మూడు చీరలు స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏట గ్రామపంచాయితి సిబ్బందికి నాస్వంత ఖర్చులతో ఇవ్వడం జరుగుతుందని అందులో బాగంగనే ఈ రోజు కూడా వారికి పండుగ సంధర్భంగా కొంత నగదు చీరెలు అందజేయడం జరిగిందని, అను నిత్యం గ్రామంలో పరిశుభ్రత కొరకు పాటుపడుతున్నారని పండుగ సందర్భంగా వారు కూడా కొత్త బట్టలు వేసుకొని బతుకమ్మ దసరా ఉత్సవాలలో పాల్గొనాలి అని ఉద్దేశంతో వారికి అందజేయడం జరిగిందని అన్నారు.

పండుగ సంధర్భంగా కానుకలు అందించినందకు గ్రామపంచాయితీ సిబ్బంది సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమార్, గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.

కెనడాలో రెచ్చిపోయిన దుండగులు.. హిందూ ఆలయంపై చెత్త రాతలు, భారత్ ఆగ్రహం