పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఓటరు జాబితా సవరణ-2024లో భాగంగా జిల్లాలలో పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్( Vikas Raj ) అన్నారు.సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ( Sarfaraz Ahmed )తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ 2024లో భాగంగా ఆయా జిల్లాలలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇందుకుగాను ఫారం 6 ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు.సవరణలు, మార్పుల కొరకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, మరణించిన వారి వివరాలు తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నోటీసులు జారీచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 An Armed Voter List Should Be Prepared , Vikas Raj, Sarfaraz Ahmed-TeluguStop.com

ఓటరు జాబితా రూపొందించడంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు.ఈ విడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube