సూపర్ స్టార్ రజినీకాంత్ ( Superstar Rajinikanth )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈయన తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్టు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ఇప్పటికీ అడపా దడపాల్సిన సినిమాలలో నటిస్తూ మెప్పిస్తున్నారు రజినీకాంత్.ఇది ఇలా ఉంటే నేడు రజినీకాంత్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.కాగా రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.
ఆయన మొదట బస్ కండక్టర్‌గా పనిచేశారు.కానీ, అంతకంటే ముందు ఆయన కూలీగా, కార్పెంటర్‌గా కూడా పనిచేశారు.
రజనీకాంత్ నటించిన తొలి చిత్రం అపూర్వ రాగంగళ్( Apoorva Ragangal ).ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు రజినీకాంత్.ఆ తర్వాత అంతులేని కథ అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.అలాగే రజినీకాంత్ కెరీర్ ప్రారంభంలో ఆయన విలన్ గా కూడా మెప్పించారు.1978లో సుమారు 20కు పైగా చిత్రాల్లో నటించారు.ఆయన హీరోగా నటించిన భైరవిఘన విజయం అందుకోవడంతో అప్పటి నుంచి ఆయన పేరు ముందు సూపర్ స్టార్ ని చేర్చారు.
బెంగళూరులోని( Bangalore ) ఒక గుడిలో రజనీకాంత్ కూర్చొని ఉండగా అక్కడున్న యాచకులు ఆయన చేతిలో డబ్బులు వేశారట!.
ఆ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ.నేనేంటో ఆ సంఘటనే తెలియజేస్తుంది.అందుకే పైపై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వను అని చెప్పుకొచ్చారు రజినీకాంత్.
దళపతి సినిమా చిత్రీకరణ సమయంలో అరవిందస్వామి తనకు తెలియక రజనీకాంత్ రూమ్‌కు వెళ్లారట.అక్కడున్న బెడ్‌పై ఆయన నిద్రపోయారు.
గాఢ నిద్రలో ఉన్న అరవిందస్వామిని లేపడం ఇష్టంలేక రజనీ అదే గదిలో నేలపై పడుకున్నారట.అప్పటికి అంతగా గుర్తింపులేని తన విషయంలో రజనీ అలా వ్యవహరించడంతో అరవింద స్వామి ఆశ్చర్యపోయారట.