డిప్రెషన్
.నేటి ఆధునిక కాలంలో చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు.
ఈ డిప్రెషన్‌తో బాధపడేవారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు.ఎంత బలవంతుడినైనా చిత్తు చేసే ఈ డిప్రెషన్ కారణంగా ప్రతి సంవత్సరం ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
డిప్రెషన్‌తో బాధ పడుతున్న వారికి అలసట, నిద్రలేమి, ఆకలి మందగించడం, ఈ విషయంలోని ఆసక్తి లేకపోవడం, ఎక్కువగా ఏడవటం ఇలా లక్షణాలు కలిగి ఉంటాయి.ఇక ఈ డిప్రెషన్ సమస్య నుంచి ఎంత బయట పడితే ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుంది.
అయితే డిప్రెషన్ సమస్యను కొన్ని ఆహారాల ద్వారా కూడా దూరం చేసుకోవచ్చు.అలాంటి వాటిలో సోయా పాలు ముందుంటాయి.అవును, డిప్రెషన్‌తో సతమతమవుతున్న వారికి సోయా పాలు అద్భుతంగా సహాయపడతాయి.ఎందుకంటే, సోయా పాలలో ఉండే మెగ్నిషియం సెరటోనిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ను వృద్ధి చేస్తుంది.
దీంతో ఒత్తిడి తగ్గి.డిప్రెషన్ క్రమంగా దూరం అవుతుంది.
అంతేకాదు, సోయా పాలలో సమృద్ధిగా ఉండే విటమిన్ బి6 కూడా మూడ్‌ను మార్చి.డిప్రెషన్‌ను పోగొడుతుంది.
అందుకే డిప్రెషన్ సమస్య ఉన్న వారు ఏవేవో పాలు కాకుండా సోయా పాలను డైట్‌లో చేర్చుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక సోయా పాలతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.సాధారణంగా చాలా మంది గేదె పాలు తాగడానికి సంకోచిస్తుంటారు.ఎందుకంటే, బరువు పెరిగిపోతారేమోనన్న భయం.
కానీ, సోయా పాలు తాగడం వల్ల శరీరంలో అదనపు కేలరీలను కరిగించి.బరువు తగ్గేలా చేస్తుంది.
అలాగే సోయా పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

ఇది ఎముకలను, దంతాలను గట్టిగా మారుస్తుంది.ఇక సోయా పాలల్లో ఉండే విటమిన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ఖనిజలవణాలు శరీరానికి తగిన శక్తిని అందించడంతో పాటు ఎక్కువ సమయం పాటు యాక్టివ్‌గా ఉండేందుకు సహాయపడతాయి.ఇక చాలా మంది జుట్టు రాలిపోతుందని బాధ పడుతుంటారు.
అలాంటి వారు సోయా పాలను రెగ్యులర్‌గా తాగడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ శిరోజాలకు బలం చూకూర్చి.ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి.