జీవితం చాలా విలువైనది వాహనాలు జాగ్రత్తగా నడపాలి.. జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో దశల వారిగా గ్రామీణ ప్రాంత యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ, రోడ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మెళ నిర్వహించి వారికి లైసెన్స్ అందజేయనున్నట్టు జిల్లా ఎస్పీ( SP Akhil Mahajan ) తెలిపారు.రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామలల్లో లైసెన్స్ మెళ గురించి అవగాహన కల్పించి,వారి వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించి,వారికి డ్రైవింగ్ లైసెన్సు కి సంబంధించిన ఆన్లైన్ పరీక్ష పై అవగాహన కల్పించి 50 మంది యువతి యువకులకు శనివారం రోజున ఆర్టీవో కార్యాలయంలో లర్నింగ్ లైసెన్స్ అందజేషిన జిల్లా ఎస్పీ.

 Life Is Very Precious Vehicles Should Be Driven Carefully.. District Sp-TeluguStop.com


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….ఈరోజుల్లో ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదని,వాహనం ఉన్నా చాలా మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు.

లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపేవారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.అదేవిధంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల భారిన పడినప్పుడు వారికి వచ్చే వారికి వచ్చే ప్రమాద భీమా వర్తించదు అన్నారు.

జిల్లాలో డ్రైవింగ్ వచ్చిన వారికి లైసెన్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో దశల వారిగా గ్రామీణ ప్రాంత యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ, జిల్లా రోడ్ రవాణా శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మెళ నిర్వహించి లైసెన్స్ లు అందజేయడం జరుగుతుందన్నారు.మొదటి దశలలో రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో లైసెన్స్ మెళపై అవగాహన కల్పించగా 50 దరఖాస్తులు రావడం జరిగిందని,వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్ టెస్ట్ కి సబధించిన పరీక్ష పై అవగాహన కల్పించి, వారితో నిర్ణిత రుసుముతో ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేపించి ఈ రోజు జిల్లా పరిధిలోని ఆర్టీవో కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ కి లర్నింగ్ టెస్ట్ సంబంధించిన పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత పొందిన 50 మందికి లర్నింగ్ లైసెన్స్ కు అందజేయడం జరిగిందని వీరికి త్వరలో డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ లు అందజేయడం జరుగుతున్నరు.

ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, సి.ఐ కిరణ్ కుమార్,ఎం వి ఐ కిషోర్ , ఎస్.ఐ అశోక్ సిబ్బంది, యువతి యువకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube