రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో నిన్నటి రోజున చాలా చోట్ల రాళ్లతో కూడిన అకాల వర్షం పడటంతో మండలంలో చాలా గ్రామాలలో పంట చాలా వరకు నష్ట పోయింది.ఈ సీజన్ లో పంటకు తెగుళ్ళు తగిలి రైతులు పురుగుల మందులు కొట్టలేక చాలా అవస్థలు పడ్డారు.
కనీసం పెట్టుబడి అయిన వస్తదని ఆశతో చూస్తున్న రైతులకు ఈ అకాల వర్షం కన్నీరే మిగిలించింది.ఈ అకాల వర్షంతొ నష్టపోయిన పంట నష్టం సర్వే చెయించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల పక్షాన డిమాండ్ చేశారు.
ఈ రోజు రాష్టంలో ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన ప్రవేశపెట్టి రైతులకు అవగాహన కల్పించి వుంటే రైతులకు చాలా బాగుండేది.ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రవేశ పెట్టి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్,జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు వాజీద్ హుస్సేన్ గారు, బూత్ అధ్యక్షులు కరికే బాబు, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రేపాక రాజు, పూజం నర్సయ్య,రాకేష్,మహేష్ రెడ్డి, చిర్రం మధు తదితరులు పాల్గొన్నారు.