టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు.పలు రాజకీయ పార్టీల నేతలకు సిట్ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.
పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి పీఏ పాత్ర ఉన్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లతో నోటీసులు ఇచ్చారని సమాచారం.ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.