అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకే నాక బంధీ కార్యక్రమం - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శనివారం రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు జిల్లాలోకి ప్రవేశించు అన్ని దారుల్లో, మండల హెడ్ క్వార్టర్స్ లల్లో పోలీసులు నాకా బంధీ నిర్వహించి పోలీస్ అధికారులు,సిబ్బంది వివిధ టీంలుగా ఏర్పడి ఏక కాలంలో ముమ్మర తనిఖీలు చేసి దాదాపు 1231 వాహనాలను తనిఖీ చేసి అందులో 8 వాహనాలను సీజ్,సరైన వాహన సరైన డాక్యుమెంట్స్ లేని 100 వాహనాల మీద స్పాట్ చలన్ వేయడం జరిగింది.మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం జరిగింది.

 Naka Bandhi Program To Arrest Anti-social Forces Suspects Sp Akhil Mahajan, Naka-TeluguStop.com

నెంబర్ ప్లేట్స్ సరిగా లేని 16 వాహనాలను సీజ్ చేయడంతోపాటుగా కొందరు అనుమానితులని విచారించి వారి ఆధార్ కార్డు తనిఖీ చేయడం జరిగింది.

రాత్రి నిర్వహించిన నాకబందిలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అంబేద్కర్ చౌక్, రగుడు చౌరస్తా వద్ద, వేములవాడ బస్టాండ్, వెంకట్రావ్ పల్లి వద్ద వాహనాల తనిఖీలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…అసాంఘిక శక్తులను ,అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకు, నేరాల అదుపుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని కల్పించడమే జిల్లా పోలీసులు లక్షమని తెలిపారు.

జిల్లాలో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని లేదా డయల్100 కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.

తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను అరికట్టవచ్చన్నారు.నిబందనలకు విరుద్దంగా ఇష్టారీతిన వాహన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయి.కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారు.

ఇలాంటి వారు వాహన తనిఖీల్లో పట్టుబడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కావున జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించి తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబందనల ప్రకారం బిగించుకోవాలని,లేని పక్షంలో వాహనాలపై నంబర్ లేకుండా నిబందనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని ఎస్పి వాహనదారులకు సూచించారు.ఈ మధ్యకాలంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి చైన్ స్నాచింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఈ యొక్క తనిఖీలు నిరంతర నిర్వహించడం జరుగుతుందని కావున జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ వారికీ సహకరించలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube