మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలు వేత్తలుగాఎదగాలి : తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర చైర్మన్ శోభా

మహిళలు తమ బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాల ను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించి, పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర చైర్మన్ శోభా( Telangana Grameena Bank Chairman Shobha ) అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గురువారం భారీ రుణమేళా కార్యక్రమం( Loan Mela Programme ) నిర్వహించారు.

 Women Should Take Advantage Of Loans And Become Entrepreneurs: Telangana Gramin-TeluguStop.com

ఈ సందర్భంగా జగిత్యాల రిజియాన్ పరిధిలో 51 తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల పరిధిలో రూ 42 కోట్లు రుణాలు మంజూరు చేసి పంపిణి చేశారు.ఈ సందర్బంగా బ్యాంకు రాష్ట్ర చైర్మన్ శోభా మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో ఒకే సారి ఇవ్వడం సాధ్యం కాదని, తమ బ్యాంకు 100% 350 గ్రూపుల సభ్యులకు ఇన్ని కోట్లు రుణాలు ఈరోజు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
1992వ సంవత్సరం నుండి స్వయం సహాయక సంఘాలు ప్రారంభించారన్నారు.20 లక్షల వరకు తమ గ్రామీణ బ్యాంకు లో ఇవ్వడం జరుగుతుందని అన్నారు.మహిళ లు చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు.ఇందుకోసం తమ బ్యాంకు ఇచ్చే రుణాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.

రుణ మేళాకార్యక్రమం పండుగ వాతావరణం లో జరిగింది.
ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్, వేములవాడ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ రావు, డిఆర్ డి వో గౌతమ్ రెడ్డి,ఏ ఆర్ డి ఓ రవికుమార్,డి పి ఎం సుధారాణి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత, తెలంగాణ గ్రామీణ బ్యాంకు జిల్లా లోని అన్ని శాఖల మేనేజర్లు, ఐ కే పి,ఏ పియం, సి సి లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube