మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలు వేత్తలుగాఎదగాలి : తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర చైర్మన్ శోభా
TeluguStop.com
మహిళలు తమ బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాల ను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించి, పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర చైర్మన్ శోభా( Telangana Grameena Bank Chairman Shobha ) అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గురువారం భారీ రుణమేళా కార్యక్రమం( Loan Mela Programme ) నిర్వహించారు.
ఈ సందర్భంగా జగిత్యాల రిజియాన్ పరిధిలో 51 తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల పరిధిలో రూ 42 కోట్లు రుణాలు మంజూరు చేసి పంపిణి చేశారు.
ఈ సందర్బంగా బ్యాంకు రాష్ట్ర చైర్మన్ శోభా మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో ఒకే సారి ఇవ్వడం సాధ్యం కాదని, తమ బ్యాంకు 100% 350 గ్రూపుల సభ్యులకు ఇన్ని కోట్లు రుణాలు ఈరోజు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
1992వ సంవత్సరం నుండి స్వయం సహాయక సంఘాలు ప్రారంభించారన్నారు.20 లక్షల వరకు తమ గ్రామీణ బ్యాంకు లో ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
మహిళ లు చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు.
ఇందుకోసం తమ బ్యాంకు ఇచ్చే రుణాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
రుణ మేళాకార్యక్రమం పండుగ వాతావరణం లో జరిగింది.ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్, వేములవాడ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ రావు, డిఆర్ డి వో గౌతమ్ రెడ్డి,ఏ ఆర్ డి ఓ రవికుమార్,డి పి ఎం సుధారాణి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత, తెలంగాణ గ్రామీణ బ్యాంకు జిల్లా లోని అన్ని శాఖల మేనేజర్లు, ఐ కే పి,ఏ పియం, సి సి లు తదితరులు పాల్గొన్నారు.
బరువు పెరగాలంటూ కామెంట్ చేసిన నెటిజన్.. సమంత ఇచ్చిపడేసిందిగా!