నూతన చట్టాలపై అధికారులు , సిబ్బంది అవగాహన పెంచుకోవాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ అన్నారు.జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు – 2023 అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు.

 Officers And Staff Should Be Aware Of The New Laws District Sp Akhil Mahajan, Of-TeluguStop.com

దానిలో భాగంగా జిల్లా పరిధిలోని అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించేలా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీసు అధికారికి, సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి,

నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేశారు అన్నారు.

భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదనీ, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు.ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి అంశాలతో శాంతిభద్రతల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తోందన్నారు.

నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని,

ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందన్నారు.ప్రతి ఒక్కొరూ నూతన అంశాలను క్రమశిక్షణతో నేర్చుకోవాలని సూచించారు.

ఇంత కాలం పాటిస్తున్న పాత విధానాలలో నూతన ధి చట్టాలకు విరుద్ధమైన వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ పాటించకూడదని, నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాలని చేయాల్సి ఉంటుందని సీపీ సూచించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులకు, సిబ్బంది కి తెలంగాణ పోలీస్ అకాడమీలో నూతన చట్టలపై శిక్షణ పొందిన అధికారులతో బ్యాచ్ ల వారిగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ కిరణ్ కుమార్ ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube