మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల కి సంబంధించిన పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మూఢనమ్మకాలు, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసే ఇండ్లు, స్థలలపై ఏకకాలం లో పోలీసులు దాడులు నిర్వహించి 11 మంది పై కేసులు నమోదు చేయడంతో పాటుగా , 09 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు.

 Superstitions Mantras And Black Magic Strict Action Will Be Taken As Per Law, Su-TeluguStop.com

కేసులు అయిన వారి వివరాలు.

1.జవ్వాజి ధనుంజయ్ s/o భమయ్య , కోరేం, బోయినపల్లి.
2.అంబటి నర్సయ్య s/o గంగారాం, రుద్రంగి.
3.బొమ్మేళ మల్లేశం s/o శంకరయ్య,చంద్రగిరి, వేములవాడ.
4.జగిరి పర్శరములు @పీర్ బాబా s/o ఎల్లయ్య ,వెంకటాపురం , ఎల్లారెడ్డిపేట్.
5.గొట్టే రామస్వామి, s/o శరబందు , r/o వెంకటాపుర్ ,ఎల్లారెడ్డిపేట్.
6.గొట్టె వెంకటరాములు s/o పర్శరాములు, r/o వెంకటాపూర్,ఎల్లారెడ్డిపేట్
7.గొట్టె శ్రీనివాస్ s/o వెంకటరాములు, r/o వెంకటాపూర్ ఎల్లారెడ్డిపేట్.
8.గొట్టె సురేందర్ s/o వెంకటరాములు, r/o వెంకటాపూర్ ఎల్లారెడ్డిపేట్.
9.గొట్టె శ్రీకాంత్ s/o శ్రీనివాస్, వెంకటాపూర్ ఎల్లారెడ్డిపేట్.
10.గొట్టె ప్రవీణ్ కుమార్ s/o సురేందర్ , r/o వెంకటాపూర్ ,ఎల్లారెడ్డిపేట్.
11.కడామంచి రామస్వామి, s/o నర్సయ్య, పెద్దూర్ సిరిసిల్ల టౌన్.

బైండోవర్ అయిన వారి వివరాలు.

1.గొట్టే రవీందర్ s/o స్వామి ,కొనరావుపేట్.
2.గొట్టే రామకృష్ణ s/o రాజనర్సు, చందుర్తి.
3.గొట్టే దయాకర్ s/o దేవయ్య, కొనరావుపేట్.
4.మహమ్మద్ మజర్ అలీఖాన్ s/o సయ్యద్ అలీఖాన్.
5.అన్నలదాస్ దశరతం s/o మల్లేశం , తంగాలపల్లి.
6.కంపెళ్లి మహేష్ s/o బలరాజ్ , తంగాలపల్లి
7.నడికుల నాగేంద్ర s/o మల్లయ్య ,నామపూర్ ,ముస్తాబద్.
8.టేకు నర్సయ్య s/o నాంపెళ్లి.బాబాజి నగర్ పెద్దూర్ సిరిసిల్ల.
9.కడమంచి దుర్గయ్య s/o దుర్గస్వామి, బాబాజి నగర్ పెద్దూర్ సిరిసిల్ల.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగిడుతున్న పరిస్థితుల్లో ప్రజలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవలే తప్ప మూఢనమ్మకాలు , చేతబడి,మంత్రాలు, నమ్మి ఇబ్బందుల్లోకి వెళ్లవద్దని, ముఖ్యంగా ఇలాంటివి నమ్మడం వల్ల ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయన్నారు.

ప్రతి వ్యక్తి చదువుకొని విజ్ఞానాన్ని పెపొందిన్చుకోవాలని సూచించారు.అనారోగ్యం పాలైన వ్యక్తులు భూతవైద్యులను ఆశ్రయించకుండా ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకోవాలని సూచించారు.మంత్రాలు, మూఢనమ్మకాల నెపంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడులకు, ఇతరత్రా వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ఈ రోజుల్లో నిరక్షరాస్యుల తోపాటు కొంతమంది చదువుకున్న వారు కూడా ఈ మూఢనమ్మకాలకు లోనై ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారు.

ఇప్పటికే చాలా గ్రామాల్లో జిల్లా పోలీస్ శాఖ తరుపున , జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు ద్వారా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేయడం జరుగుతుందన్నారు.చేతబడి, మంత్రాలు,మూఢనమ్మకాల పేరుతో ఎవరినైనా ఇబ్బందులకు గురిచేస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube