బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా : బడిబాట కార్యక్రమం( Badi bata program )లో బాగంగా నేడు నెహ్రు నగర్, గీత నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జడ్పీ ఛైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణి చేశారు.ఈ సందర్బంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యకి పెద్దపీఠం వేశారన్నారు.

 Distribution Of Books And Uniforms To Students In Badibata Program-TeluguStop.com

అన్ని ప్రభుత్వ పాఠశాలలు మెరుగు అయ్యాయని అన్నారు.మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా సౌకర్యాలు సమకూర్చారన్నారు.

అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విద్యకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని వసతులు ఏర్పాటు చేయాలనీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూడాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురువులు బోధించే విద్యని శ్రద్ధ గా పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేసారు.

అలాగే తల్లిదండ్రులు ప్రయివేట్ పాఠశాలలకు మొగ్గు చూపకుండా ఎక్కువ ఫీజులు చెల్లించి ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలని ప్రయివేట్ పాఠశాలలు( Private schools ) ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విద్య నేర్పుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, జిల్లా విద్యాధికారి రమేష్, డిఆర్డిఏ శేషాద్రి, ఎంఈఓ రఘపతి, అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ చైర్మన్ రుక్మిణి, పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు భాగ్య రేఖ, సెక్టరియల్ ఆఫీసర్ సతీష్ కుమార్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube