రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో గల ఎనిమిది గ్రామ సంఘాలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అందజేశారు.ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం అవరణలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించి మహిళల కు సెర్ప్ ద్వారా వచ్చిన బ్యాంక్ లింకేజీ వడ్డీలేని రుణాలు ఎనిమిది గ్రామ సంఘాలకు(వి.ఓ’లకు) 189 స్వయం సహాయక సంఘాలకు గాను 44 లక్షల 52 వెయిల 6 వందల 68 రూపాయల ప్రొసీడింగ్స్ వి.ఓ.అధ్యక్షులకు ,వి.ఓ.ఏ.లకు అందజేయడం జరిగింది.సమావేశం అనంతరం మహిళా సంఘాల సభ్యులకు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి బోజన సౌకర్యంఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి పిల్లి రేణుక యాదవ్ ,జడ్పీటీసీ,చీటీ లక్ష్మణ్ రావు ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,ఎంపీటీసీ1 పందీర్ల నాగరాణి ఎంపీటీసీ2 ఎనగందుల అనసూయ,సెస్ డైరెక్టర్ వరస కృష్ణ హరి, ప్యాక్స్ ఛైర్మెన్, కృష్ణా రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షురాలు అప్సరున్నిసా,పట్టణ శాఖ అద్యక్షులు బండారి బాల్ రెడ్డి తో పాటు వార్డ్ సభ్యులు , ఏ పి ఎం మల్లేశం పంచాయతీ కార్యదర్శి దేవరాజు వి.ఓ.ఏ.లు,గ్రామ సంఘాల అధ్యక్షులు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు