నేరాల నియంత్రణకు గ్రామాల్లో,పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్, బిట్స్ నిర్వహించాలి.

విధి నిర్వహణలో ఉత్తమా ప్రతిభ కనబర్చిన అధికారులకు,సిబ్బందికి ప్రశంశ , ప్రోత్సాహకాలు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

 In Order To Control Crime, Intensive Patrolling And Bits Should Be Organized In-TeluguStop.com

ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….నేరాల నియంత్రణకు గ్రామాల్లో,పట్టణాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, జిల్లాలో నేరాలు జరుగుతున్న తీరు,ఎక్కువగా నేరాలు జరుగుతున్న ప్రాంతాలు గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రతి రోజు సాయంత్రం సమయంలో బీట్స్ (గస్తీ) ఏర్పాటు చేసి ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండి ముందస్తు నేరా నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలనీ సూచించారు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు.

పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.దొంగతనాలపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిఘాను పటిష్టం చేయాలని,దొంగతనం కేసులల్లో ప్రతి రోజు కేసుల చెదనలో భాగంగా అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ,ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు చేధించాలని, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోని ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి, పేకాట, పిడిఎస్ రైస్, గుడుంబా,ఇతర చట్ట వ్యతిరేకమైన నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలని, ఇతర చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని,ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్,మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.

విధి నిర్వహణలో ఉత్తమా ప్రతిభ కనబర్చిన అధికారులకు,సిబ్బందిని అందినదించి ప్రశంశ ప్రోత్సాహకాలు అందించారు.ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు , ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube