ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడిని ఖండిస్తూ సంకెళ్లతో నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా : బి.ఆర్.

 Chained Protest Condemning The Attack On Mla Padi Kaushik Reddy House, Chained P-TeluguStop.com

ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలో చేతికి సంకెళ్ళతో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టపగలు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని కౌశిక్ రెడ్డి ని గృహనిర్బంధం లో ఉంచి పోలీసుల సహాయంతో అరికెపూడి గాంధీ తన గుండాలతో రెచ్చిపోయి దాడులు పాల్పడటం రాష్ట్రంలో ఫ్యాక్షనిజం రౌడీయిజానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డాగా మారుస్తుందని అన్నారు.

ఈ దాడి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించాడని ఆయన మండిపడ్డారు.గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతు పార్టీ ఫిరయింపులు చేసిన ఎమ్మెల్యేల పైన న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డి పైన ఈ ప్రభుత్వం టార్గెట్ చేసి కావాలని తనపైన అక్రమ కేసులు బనాయించి హత్యాయత్నం చేసి బెదిరించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అన్నారు.

ఇలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదు అని,దాడి చేసిన వారిపైన కేసులు పెట్టి అరెస్టు చేయాలని కౌశిక్ రెడ్డికి ఏదైనా జరుగుతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు.అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్నా కౌశిక్ రెడ్డిని నిర్బంధంలో వుంచిన పోలీసులు,అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి రావడానికి ఎలా అనుమతించారని వందల మంది కాంగ్రెస్ గుండాలు కోడిగుడ్లు,రాళ్లతో దాడి చేసిన పట్టించుకోని ప్రభుత్వం.

ఇలా అక్రమ కేసులు దాడులతో బెదిరించడం ఇదేనా ఇందిరమ్మ పాలన ఇదేనా ప్రజా పాలన అని,ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ఇలాంటి అరాచకాలు సరైనది కాదని అన్నారు.రానున్న రోజుల్లో దాడికి ఎదురుదాడికి కూడా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇకనైనా కాంగ్రెస్ వ్యవహార శైలి మార్చుకోవాలని లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదురు కోవాల్సి వస్తుందని తెలిపారు.దాడి చేసినందుకు వెంటనే కౌశిక్ రెడ్డికి బి ఆర్ ఎస్ నాయకులకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మిమ్మల్ని అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు కొడం వెంకటేష్, వావిలాల సాయి,శ్రీనివాస్, పొతర్ల వంశీ, కోడి రోహిత్, సాయి,హర్శిత్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube