రాజన్న సిరిసిల్ల జిల్లా: మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న నింధితురాలు, సహకరించిన మరో వ్యక్తి అరెస్ట్.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ చింతలటాన గ్రామము, R/R కాలానికి చెందిన చొక్కారపు వనజ d/o మల్లయ్య అనే మహిళ గత కొన్ని సంవత్సరాల నుండి తాను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నానని వేములవాడ చుట్టూ ప్రక్క గ్రామాలకు చెందిన యువకులను మోసపూరితమైన మాటలు చెప్పి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా నందు రిపోర్టర్లుగా పెట్టిస్తానని, జిల్లాలో తనకు చాలామంది పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు పరిచయం ఉన్నారని, రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో తాను ఏది చెబితే అదే ప్రభుత్య అధికారులు చేస్తారని నమ్మించి అక్రిడేషన్ కార్డ్లు ఇప్పించి ఇట్టి కార్డ్ ద్వారా ప్రభుత్వం నుండి వచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల ప్లాట్లు, ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డు భూములు ఇప్పిస్తానని చెప్పి 2019 సంవత్సరంలో మల్యాల గ్రామానికి చెందిన రొండి చంద్రయ్య వద్ద నుండి దాదాపు 16,00,000/-రూపాయలు తీసుకొని మోసం చేసినది.
అదేవిధంగా చందుర్తి మండలం లోని రామన్నపేట గ్రామమునకు చెందిన పేద రైతు ఆరుట్ల ఆది మల్లయ్యకు మూడు ఎకరాల వ్యవసాయ భూమిని తంగళ్ళపల్లి మండలంలోని సారంపెళ్లి గ్రామ శివారులో ఇప్పిస్తానని చెప్పి నమ్మించి దాదాపు 10,00,000/- రూపాయలు తీసుకొని చొక్కాల వనిజ మోసం చేసింది.
మోసపోయిన బాధితుల పిర్యాదు మేరకు చందుర్తి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి నిందితురాలని మరియు నిందితురాలికి సహకరించిన మాల్యాల గ్రామానికి చెందిన పీసరి శ్రీనివాసును అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని వేములవాడ ఏఎస్పీ తెలిపారు.
చొక్కాల వనజ చేతిలో మోసపోయిన భాదితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని, బాధితులకు అండగా ఉండి పూర్తి సహకారం అందిస్తామని వేములవాడ ఏఎస్పీ తెలిపారు.