రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సందర్శించారు.పీఈటీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ రోడ్డుపై విద్యార్థులు ఆందోళన చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ రమేష్ కుమార్ చేరుకొని, విద్యార్థులతో మాట్లాడారు.
వెంటనే పీఈటీని తొలగించారు.అనంతరం కలెక్టర్ విద్యాలయానికి చేరుకొని వారితో మాట్లాడారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ కు సూచించారు.ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.ఇక్కడ విద్యాలయం ప్రత్యేక అధికారి, డీసీఓ రామకృష్ణ, ప్రిన్సిపాల్ శకుంతల తదితరులు పాల్గొన్నారు.







