రెసిడెన్షియల్ విద్యాసంస్థలను అధికారులు తనిఖీ చేయాలి

విద్యాసంస్థల వారీగా ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, సౌకర్యాల తీరును తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల వారీగా 21 మంది జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

 Residential Educational Institutions Should Be Inspected By The Authorities , Re-TeluguStop.com

అధికారులు విద్యాలయాలను తనిఖీ చేయడంతో పాటు ప్రతీ నెలలో ఒక రోజు రాత్రి బస చేయాలని ఆదేశించారు.విద్యార్థులకు అందుతున్న అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాల తీరు గురించి తనిఖీ చేసిన అనంతరం నోడల్ అధికారి, జిల్లా విద్యాధికారి రమేష్ కు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విద్యాలయాల వారీగా ప్రత్యేకాధికారులు వీరే…

TSWREIS (బాలికలు), ఇల్లంతకుంట – పి.రజిత, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్.

TSWREIS (బాలికలు), నర్మాల, గంభీరావుపేట – ఎం.విజయలక్ష్మి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి.

TSWREIS (బాలికలు), మానాల, రుద్రంగి – అర్.వి.రాధాబాయి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్.

TSWREIS (బాలికలు), నేరెళ్ళ, తంగళ్ళపల్లి – డి.స్వప్న, ఈడీ ఎస్సీ కార్పోరేషన్.

TSWREIS (బాలికలు), చిన్న బోనాల, సిరిసిల్ల & MJPTBCWREIS (బాలికలు) సిరిసిల్ల – అఫ్జల్ బేగం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి.

TSWREIS (బాలికలు), బద్దెనపల్లి, తంగళ్ళపల్లి – వసంత లక్ష్మి, జిల్లా పౌర సరఫరాల అధికారి.

TSMREIS (బాలికలు), తంగళ్ళపల్లి – కె.ఆర్.లత, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి.

MJPTBCWREIS (బాలికలు) వేములవాడ & TSWERIS (బాలికలు), వేములవాడ – ఎం.గీత, జెడ్పీ డిప్యూటీ సీఈఓ.

TWREIS జూనియర్ కళాశాల (బాలికలు), దుమాల, ఎల్లారెడ్డిపేట – ఎం.ఏ.భారతి, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా పరిశ్రమల శాఖ.

TSWREIS (బాలుర), బోయినిపల్లి – ఎం.సాగర్, అసిస్టెంట్ డైరెక్టర్, హ్యాండ్లూమ్స్.

Telangana EMRS (Co-Education), మర్రిమడ్ల, కోనరావుపేట – పి.లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ శాఖ అధికారి.

TW Ashram (Co-Education), కోనరావుపేట – ఎస్.క్రాంతి కుమార్, ఏడీ మైన్స్.

TSWREIS (బాలుర), ముస్తాబాద్ – వి.రవీందర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి.

MJPTBCWREIS (బాలుర), సర్ధాపూర్, సిరిసిల్ల – నజీర్ అహ్మద్, సహాయ లేబర్ అధికారి.

MJPTBCWREIS (బాలుర), మండెపల్లి, సిరిసిల్ల – పి.బి.శ్రీనివాస చారి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి.

TTWURJC (బాలుర), తంగళ్ళపల్లి – టి.రామకృష్ణ, జిల్లా సహకార శాఖ అధికారి.

TMREIS (బాలుర), వేములవాడ – వినోద్, జెడ్పీ సీఈఓ.

MJPTBCWREIS (బాలుర), వేములవాడ – ఎస్.రాజేశ్వర్, ఆర్డీఓ, వేములవాడ.

Telangana EMRS (Co-Education), ఎల్లారెడ్డిపేట – ఎ.రాందాస్, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube