సే నో టూ ర్యాగింగ్.. ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో మహిళల రక్షణ,ఈవ్ టీజింగ్,ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై పాలిటెక్నిక్, డిగ్రీ, జె ఎన్ టి ఎచ్ యు కళాశాల ల విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైందని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటి దశలోనే కట్టడి చేయాలని,కలశాల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు.

 Say No To Ragging Ragging Is A Legal Offence, No Ragging, Ragging , Legal Offen-TeluguStop.com

విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని,

తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్ధి లక్ష్యం కాదు అని తెలిపారు.విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అనేది లేకుండా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు.

ర్యాగింగ్ చేయడం నేరమని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్చరించారు.ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డయల్ 100 కు తెలియజేసి సమాచారం అందించాలన్నారు.

గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలాంటి వ్యసనాలకు బానిసై విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

విద్యార్థినిలు మహిళలు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని, నిర్భయంగా ముందుకు వచ్చి మీ సమస్యలను చెప్పుకున్నాప్పుడే మరింత భద్రత కల్పించగలువుతామని, మహిళలు,విద్యార్థినిలు జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.

పిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,సి.ఐ వీరప్రసాద్, ఎస్.ఐ లు రమేష్, అంజయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, జె ఎన్ టి ఎచ్ యు కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చారి , షీ టీమ్ సిబ్బంది , భరోసా సెంటర్ సిబ్బంది , కళాశాల ల యాజమాన్యం, విద్యార్థిలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube