తీరనున్న వేములవాడ వాసులు, రాజన్న భక్తుల కష్టాలు

ఎన్నో ఏండ్ల నాటికల నెరవేరునుంది.వేములవాడ పట్టణవాసులు, రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు దూరం కానున్నాయి.

 Vemulawada Rajanna Temple Devotees Problems Are Going To Solve, Vemulawada Rajan-TeluguStop.com

మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం దాకా రోడ్డు వెడల్పు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కృషి తో విస్తరణ పనులకు మోక్షం లభించింది.భూ సేకరణ సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది.

శనివారం తెలంగాణ ప్రభుత్వం, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం వారు భూ సేకరణ నిమిత్తం ప్రకటన విడుదల చేశారు.

ఆలయం.

పట్టణాభివృద్ధి.ఒక వైపు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పుడు రోడ్డు వెడల్పు పనులకు ప్రకటన విడుదల కావడంతో ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంతోపాటు ఆలయం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.దూరం కానున్న ట్రాఫిక్ కష్టాలు.

రాజన్న ఆలయానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతుంది.దానికి అనుగుణంగా పట్టణంలో రోడ్డు విస్తరణ లేకపోవడంతో వాహనదారులు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

స్పష్టమైన ప్రణాళిక పక్కా ఆచరణ.కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక పక్క ఆచరణతో ముందుకెళ్తుంది.ఇందులో భాగంగా ఇప్పటికే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శనాన్ని అమలులోకి తీసుకొచ్చింది.విజయవంతంగా కొనసాగుతుంది.

అలాగే భక్తుల ప్రీతిపాత్రమైన మొక్కు కోడె మొక్కుకు వినియోగించే కోడెల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.దీనిపై ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి కోడెల సంరక్షణకు మూడు షెడ్లు నిర్మింప చేశారు.

గోశాలలో సీసీ నిర్మాణం, అలాగే డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.గోవులకు పచ్చ గడ్డి, దాణా అందిస్తున్నారు.

ఎక్కువ సంఖ్యలో ఉన్న కోడెలను అర్హులైన రైతులకు ఇప్పటికే అందజేశారు.అలాగే భక్తులకు తిరుమల తరహాలో నిత్యాన్నదానం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటించగా,

దానికోసం ఆలయం సమీపంలోని శివార్చన స్టేజి వద్ద సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

దానికోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.ఇలా ఒక్కో పనిని స్పష్టమైన ప్రణాళికతో ఆచరణలో పెడుతూ ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే.

ఇప్పుడు వేములవాడలో ట్రాఫిక్ కష్టాలు దూరం చేసేందుకు దూరం చేసే పనులకు శ్రీకారం చుట్టారు.పట్టణవాసులు, వాహనదారులు భక్తులు తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం వరకు వేగంగా చేరుకునేందుకు మరికొద్ది రోజుల్లో మార్గం సుగమం కానుంది.

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేపడుతున్న పనులపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube