పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆడపడుచుల ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను ప్రారంభించారు.

 Worshiping Flowers Is A Great Culture Of Telangana District Sp Akhil Mahajan, Wo-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు.తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి తెలిపారు.

పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడటం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో , వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు,ఆర్.ఐ లు మరియు ఎస్.ఐ లు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube