జిల్లా పరిధిలోని విధ్యార్థిని, విధ్యార్థులకు,యువతకు ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం.

రాజన్న సిరిసిల్ల జిల్లా :శాంతి భద్రతల,సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “ పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి జిల్లాలో ఆసక్తి గల యువతక ఔత్సహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు,పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే తీసిన (3) ఫోటోలు,తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20 వతేదీ సాయంత్రంలోగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ పిఆర్వో కి అందజేయాలన్నారు.

 Invitation To Photography And Short Film Competitions For Students, Students And-TeluguStop.com

ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదు, 10 x 8 సైజ్ ఫోటోలను ,షార్ట్ ఫిలింను పెన్ డ్రైవ్ లో మీ యెక్క పూర్తి వివరాలతో అందజేయలని, జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలింలను, ఫొటోలను రాష్ట్ర స్థాయి పోటీల గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాదుకు పంపించడం జరుగుతుందన్నారు.మరిన్ని వివరాల కోసం 87126 56431 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు.

    .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube